
ప్రధానాంశాలు
ప్రేమోన్మాది ఘాతుకం
ప్రేమించి దూరం పెట్టిందని యువతిపై కత్తితో దాడి
నార్సింగి న్యూస్‌టుడే: ప్రేమించిన యువతి కొద్ది కాలంగా పట్టించుకోకపోవడంతో ప్రేమోన్మాది ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గండిపేట మండలం హైదర్షాకోట్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...హైదర్షాకోట్కు చెందిన యువతి(29) ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తోంది. ఇక్కడ ఓ అంతర్జాతీయ క్షౌరశాలలో పనిచేసే హరియాణ రాష్ట్రానికి చెందిన షారూఖ్ సల్మాన్(29)తో ఆమెకు కొంత కాలంగా పరిచయం ఉంది. ఇద్దరూ తరచూ కలుసుకునే వారు. సల్మాన్ అప్పుడప్పుడు ఇంటికి సైతం వచ్చేవాడని తెలిసింది. ఇటీవల యువతికి పెళ్లిసంబంధం కుదరడంతో సల్మాన్‌ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే మే నెలలో ముహూర్తం నిర్ణయమైనట్లు సమాచారం. దీంతో ఆగ్రహం చెందిన సల్మాన్ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో యువతి ఫ్లాట్‌కు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల కేకలతో అప్రమత్తమైన స్థానికులు పారిపోతున్న అతణ్ని పట్టుకుని నార్సింగి పోలీసులకు అప్పగించారు. గాయపడిన యువతిని లంగర్‌హౌస్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వీపు భాగంలో రెండు తీవ్ర గాయాలు, రెండు చిన్నగాయాలయ్యాయి. ఆమె కోలుకుంటోందని పోలీసులు తెలిపారు.
మరిన్ని
సినిమా
- అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- కేటీఆర్ సర్ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా?
- తారక్ అభిమానులకు శుభవార్త!
- ప్రగ్యా నవ్వులు.. మెరిసిన ప్రియాంక..
- ‘ఉప్పెన’ జోడీగా సుధీర్-రష్మి సందడి
- తొలిపోరులో హైదరాబాద్ ఓటమి
- రోడ్డుప్రమాదం:కుమార్తె సహా దంపతుల మృతి
- పేడ దిబ్బలో మహిళ అస్తిపంజరం
- ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!
- పవన్ నటించలేదు: నాగబాబు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
