
ప్రధానాంశాలు
చెప్పిందే చెబుతున్న నిందితులు
న్యాయవాదుల కేసులో క్షేత్ర స్థాయిలో విచారణ
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి, ఈనాడు, హైదరాబాద్: న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బుధవారం రామగుండం అడ్మిన్ డీసీపీ అశోక్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో నిందితులు కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌లతో క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించారు. కేవలం వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్యలకు పాల్పడ్డామంటూ వారు చెప్పిన విషయాలనే మళ్లీమళ్లీ చెబుతున్నట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది. హత్యలకు ముందు నిందితులు ముందు ఎక్కడెక్కడ రెక్కీ నిర్వహించారు? వామన్‌రావు దంపతులను ఎలా అనుసరించారు? వంటి అంశాలపై విచారణ అధికారులు ఆరా తీశారు. రామగుండం కమిషనరేట్ నుంచి బుధవారం ప్రత్యేక వాహనాల్లో వారిని మంథనికి తీసుకొచ్చి హత్యకు ముందు రెక్కీ నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి వామన్‌రావు కారును అనుసరించిన తీరుపై పరిశీలించారు. రామగిరి మండలం కల్వచర్ల వద్ద సంఘటన స్థలానికి తీసుకెళ్లి వామన్‌రావు వాహనాన్ని అడ్డగించిన, హత్య చేసిన తీరుపై (సీన్ ఆఫ్ అఫెన్స్) సమగ్రంగా ఆరా తీశారు. మొత్తం విచారణను వీడియోలో రికార్డు చేశారు. కుంట శ్రీను, బిట్టు శ్రీనులను మంగళ, బుధవారాల్లో పోలీసులు విడివిడిగానూ, ఇద్దరినీ కలిపి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. వామన్‌రావు తమతో ప్రవర్తించిన తీరు, కోర్టులో వేసిన కేసులు, జరిగిన అవమానాల ఫలితంగానే కక్ష పెంచుకుని హత్య చేశామని వారు చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా పోలీసులు వారి నుంచి సాక్ష్యాలు సేకరించారు. హత్యకు ముందు 4 నెలల నుంచి మంథనిలో ఎన్నిసార్లు కలిశారు? ఎన్నిసార్లు ప్రణాళిక వేసుకున్నారు? ఇంకా ఈ కేసులో పరోక్షంగా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. వామన్‌రావుతో తమకు వ్యక్తిగతంగా ఉన్న పగ, ప్రతీకారాల కారణంగానే హత్యకు ప్రణాళిక వేశామని, ఆయన భార్య నాగమణి కూడా న్యాయవాది కావడం, ఆమెను కూడా చంపితే ప్రధాన సాక్ష్యం ఉండదనే ఉద్దేశంతోనే ఇద్దరినీ చంపేశామని నిందితులు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి స్థాయిలో సత్వరమే విచారణ పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించడంతో మరింత పకడ్బందీగా విచారణ కొనసాగిస్తున్నారు.
కీలక ఆధారం ఆ స్టిక్కర్!
న్యాయవాద దంపతుల హత్య కేసులో క్లూస్ టీం సేకరించిన ఆధారాలే కీలకం కానున్నాయి. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి ముందుగా తమ కారును వామన్‌రావు కారుకు ఎదురు తీసుకెళ్లి అడ్డుపెట్టడమే కాకుండా ఢీకొట్టారు. ఈ క్రమంలో నిందితుల కారుకు ఉన్న పసుపు రంగు రేడియం స్టిక్కర్‌లోని కొంతభాగం వామన్‌రావు కారు ముందు భాగానికి అతుక్కుపోయింది. ఈ ఆధారాన్ని క్లూస్ టీం సేకరించింది. నిందితుల కారు డ్రైవర్ డోర్ హ్యాండిల్, గేర్ రాడ్‌పై రక్తపు మరకలనూ సేకరించింది. ఆ మరకలు హతులవే అని తేల్చగలిగితే హత్యలో నిందితుల పాత్ర నిగ్గు తేల్చడంలో కీలకాధారాలు కానున్నాయి.
కత్తులకు రక్తపు మరకలపై..
హత్యకు వినియోగించిన ఆయుధాలు మరో కీలక ఆధారాలు కావడంతో కత్తులను సుందిళ్ల రిజర్వాయర్ నుంచి వెలికితీసిన సంగతి తెలిసిందే. పది రోజులకు పైగా నీటిలో ఉండిపోవడంతో కత్తులు తుప్పు పట్టి రక్తపు మరకలు చెరిగిపోతాయి. వాటిని ఆధారాలుగా మలచడం క్లూస్ టీం, ఎఫ్ఎస్ఎల్ నిపుణులకు సవాల్‌తో కూడుకున్న పని. దీంతో రిజర్వాయర్ అడుగు భాగంలో గల మట్టి నమూనాల్ని సేకరించి.. కత్తుల పిడిభాగాల్లో ఇరుక్కుపోయిన మట్టి రేణువుల్ని.. ఆ మట్టి నమూనాలతో పోల్చి ఆధారాలుగా మలచడంపై వారు దృష్టి సారించారు.
మరిన్ని
సినిమా
- ఓటీటీలో ‘వకీల్‌సాబ్’: స్పష్టత ఇచ్చిన చిత్ర బృందం
- పంజాబ్ భల్లే భల్లే..
- ఓడిపోయానని భావించిన క్షణమే మలుపుతిరిగింది..
- ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- అనుపమ కోపం.. జెనీలియా అల్లరి.. తమన్నా సెల్ఫీ
- అక్షయ్ క్షేమంగా ఉన్నారు: ట్వింకిల్
- #ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
- తిరుపతి తెదేపా సభలో రాళ్లదాడి
- రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
- కొవిడ్ కేర్ సెంటర్లుగా స్టార్ హోటళ్లు..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
