
ప్రధానాంశాలు
పోలీసులే కీచకులయ్యారు!
జలగావ్లో దుస్తులు విప్పించి అనాథ బాలికలతో నృత్యాలు
జలగావ్: కామాంధుల నుంచి, కామాటిపురల నుంచి కాపాడాల్సిన రక్షక భటులే...కీచకపర్వానికి తెరలేపారా?... మహారాష్ట్రలోని జలగావ్లో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న మహిళ, శిశు సంరక్షణ వసతి గృహంలో చోటుచేసుకున్నాయని భావిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకొనేలా చేశాయి. కొందరు బయటి వ్యక్తులు, పోలీసులు వసతి గృహానికి వచ్చి అక్కడ ఆశ్రయం పొందుతున్న బాలికలను బెదిరించి, బలవంతంగా దస్తులు విప్పించి, అసభ్య నృత్యాలను చేయించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, బాధిత బాలికలు మంగళవారం జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో ఈ దురాగతం వెలుగులోకి వచ్చింది. చిఖ్లి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే శ్వేతా మహాలే బుధవారం ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దుశ్చర్యలకు పాల్పడితే సమాజానికి దిక్కెవరని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దర్యాప్తునకు ఆదేశించారు. నలుగురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.
మరిన్ని
సినిమా
- ఓటీటీలో ‘వకీల్‌సాబ్’: స్పష్టత ఇచ్చిన చిత్ర బృందం
- పంజాబ్ భల్లే భల్లే..
- ఓడిపోయానని భావించిన క్షణమే మలుపుతిరిగింది..
- ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- #ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
- అనుపమ కోపం.. జెనీలియా అల్లరి.. తమన్నా సెల్ఫీ
- అక్షయ్ క్షేమంగా ఉన్నారు: ట్వింకిల్
- తిరుపతి తెదేపా సభలో రాళ్లదాడి
- కొవిడ్ కేర్ సెంటర్లుగా స్టార్ హోటళ్లు..!
- రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
