
ప్రధానాంశాలు
వంట చేస్తుండగా మంటలు
తల్లీకూతుళ్ల సజీవ దహనం
మెదక్, న్యూస్‌టుడే: వంట చేస్తుండగా మంటలు అంటుకొని తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. గురువారం మెదక్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. గట్టయ్య, నాగమణి అలియాస్ రేవతి (28)లకు అయిదేళ్ల క్రితం వివాహమైంది. గట్టయ్య ఉదయం 9 గంటలకే విధులకు వెళ్లిపోయారు.10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో రేవతి (28)వంట చేస్తుండగా చున్నీకి నిప్పంటుకుంది. అక్కడే ఉన్న కుమార్తె ఆద్యశ్రీ (3)కి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ సజీవ దహనమయ్యారు. ఇంటి యాజమాని మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె తల్లిదండ్రులు, భర్త సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను చూసి బోరున విలపించారు.
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
సినిమా
- ‘వకీల్ సాబ్’కు మహేశ్‌బాబు ప్రశంసలు
- తక్కువ ఖర్చుతో వినూత్న ఇల్లు
- హోం క్వారంటైన్లో పవన్
- పవన్.. మీకు ఈ మాట చెప్పమన్నారు: దిల్‌రాజు
- అదే టిప్పర్.. అదే డ్రైవర్
- ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!
- ప్చ్.. ఇది వాళ్ల వ్యక్తిగతం
- మెహ్రీన్ లవ్ ప్రపోజ్.. నజ్రియా దాగుడుమూతలు
- మా కరోనా టీకాలకు అంత సీన్ లేదు!
- దిల్లీ దంచేసింది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
