close

ప్రధానాంశాలు

Published : 06/03/2021 05:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

పెద్దారవీడు, న్యూస్‌టుడే: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతలలో శుక్రవారం చోటుచేసుకుంది.  బొమ్మనబోయన ఆవులయ్య(36) తన రెండు ఎకరాల పొలంలో మిరప, పత్తి పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంట దిగుబడి లేక ఏటా నష్టాలే మిగులుతున్నాయి. గత నాలుగు సంవత్సరాల వ్యవధిలో సాగునీటి కోసం ఎనిమిది బోర్లు వేయించారు. వ్యవసాయం, బోర్లకు దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి.   దీంతో పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన