close

ప్రధానాంశాలు

Published : 06/03/2021 06:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెల్లి పెళ్లికి అధిక కట్నం ఇస్తున్నారని అక్కసు!

తల్లిని కడతేర్చిన తనయుడు

బేస్తవారపేట, న్యూస్‌టుడే: చెల్లి పెళ్లికి తల్లిదండ్రులు అధిక మొత్తంలో కట్నకానుకలు ఇవ్వనున్నారన్న అక్కసుతో కన్న తల్లినే కర్కశంగా కడతేర్చాడు ఓ తనయుడు. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం ఖాజీపురంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పూనూరు అరుణ(45), పెద్ద వెంకటరెడ్డి దంపతులకు కుమారుడు హరీష్‌ కుమార్‌రెడ్డి, కుమార్తె కల్యాణి ఉన్నారు. హరీష్‌ పదో తరగతి చదివి ఊరులోనే చిన్నచిన్న పనులు చేస్తున్నాడు. కల్యాణి బీ-ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయించారు. అధిక మొత్తంలో పెళ్లి కానుకలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు నిర్ణయించడంతో హరీష్‌ కోపంతో ఉన్నాడు. పెళ్లి చేయవద్దని తల్లితో తరచూ గొడవ పడుతున్నాడు. శుక్రవారం ఉదయం తండ్రి బయటకు వెళ్లగా ఇంట్లో వంట పాత్రలు శుభ్రం చేస్తున్న తల్లి తలపై రోకలి బండతో గట్టిగా కొట్టి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అరుణను ఆసుపత్రికి    తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన