close

ప్రధానాంశాలు

Published : 06/03/2021 05:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పోలీసులతో ప్రాణహాని ఉంది’

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: ‘తమ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి పోలీసులు అడ్డు చెప్పడంతో పాటు బలవంతంగా స్టేషన్‌కు తీసుకొచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారితో ప్రాణహాని ఉంది’ అంటూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఠాణా ఎదుట శుక్రవారం తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. పురపాలక సంఘంలోని మొత్తం 25 వార్డుల్లో 11 చోట్ల తెదేపా అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో కొందరు ప్రచారం చేసుకోకుండా పోలీసులు అడ్డుకొంటూ, బైండోవర్‌ పేరిట బలవంతంగా ఠాణాకు తీసుకెళ్లారంటూ కొందరు నాయకులు స్టేషన్‌కు వెళ్లి ఆందోళనకు దిగారు. ఈ లోపు అక్కడికి చేరుకున్న సీఐ వెంకటేశ్వరరెడ్డి, పార్టీ తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్‌రెడ్డి మధ్య వాగ్వాదం చేసుకుంది. ఆందోళన విరమించకుంటే అభ్యర్థులతోపాటు స్టేషన్‌కొచ్చిన వారినీ అరెస్టు చేస్తామని సీఐ చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని, ఇరువురికి నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన