
ప్రధానాంశాలు
కల్తీ మద్యం కేసులో 9 మందికి మరణశిక్ష
నలుగురు మహిళలకు జీవిత ఖైదు
గోపాల్‌గంజ్: బిహార్‌లోని ఓ కోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. కల్తీ మద్యం విక్రయించి పలువురి మృతికి కారణమైన 9 మందికి గోపాల్‌గంజ్‌లోని న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మరో నలుగురు మహిళలకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. 2016 ఆగస్టులో ఖజుర్బనీ ప్రాంతంలో కల్తీ మద్యం తాగి 19 మంది చనిపోయారు. రాష్ట్రంలో నీతీశ్ ప్రభుత్వం మధ్యపాన నిషేధం విధించిన కొద్ది నెలల తర్వాత చోటు చేసుకున్న ఈ ఉదంతంపై అప్పట్లో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కొందరు పోలీసులను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. ఖజుర్బనీ ప్రాంతంలో 25-30 కుటుంబాలు కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను గుర్తించగా విచారణ సమయంలో ఒకరు చనిపోయారు. మిగతా 13 మందికి అదనపు జిల్లా జడ్జి లవ్‌కుశ్ కుమార్ శిక్షలు విధించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవిభూషణ్ శ్రీవాస్తవ తెలిపారు.
మరిన్ని
సినిమా
- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- భారత్‌లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
