close

ప్రధానాంశాలు

Updated : 06/03/2021 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నౌహీరా బెయిల్‌ మరో 6 వారాల పొడిగింపు

తెలంగాణ అధికారులు, పోలీసుల తీరుపై ధర్మాసనం అసహనం
రాష్ట్రంతో ఒవైసీ ఆడుకుంటున్నారన్న హీరాగోల్డ్‌ న్యాయవాది

ఈనాడు, దిల్లీ: నౌహీరా షేక్‌ బెయిల్‌ గడువును సుప్రీంకోర్టు మరో ఆరు వారాలపాటు పొడిగించింది. డిపాజిటర్లకు చెల్లింపులు చేపట్టేందుకు వీలుగా నౌహీరాకు బెయిల్‌ ఇవ్వాలని గత విచారణలో ఆమె తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం మన్నించింది. ఆరు వారాల గడువు ముగియడంతో బెయిల్‌ పిటిషన్‌ పొడిగింపుపై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ద్విసభ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. బెయిల్‌ సమయంలో కోర్టు షరతులన్నింటినీ పాటించామని ఆమె తరఫు న్యాయవాది రంజిత్‌కుమార్‌ విన్నవించారు. తెలంగాణలోని 347 మంది డిపాజిటర్లకు చెల్లింపులు ఎందుకు చేపట్టలేదని ధర్మాసనం ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు రికార్డులు అందలేదని రంజిత్‌కుమార్‌ తెలిపారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది బసంత్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. నౌహీరా తరఫు న్యాయవాది జోక్యం చేసుకున్నారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని డిపాజిట్లరకు ఇప్పటికే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఖాతా పునరుద్ధరణకు, తాజా ఒప్పందానికి అనుమతి ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ జోక్యం చేసుకుని తెలంగాణలోని డిపాజిటర్లకు చెల్లింపులకు ఎంత సమయం కావాలని ప్రశ్నించారు. పభుత్వ రికార్డులు, ఐపీజీల పరిశీలనకు, పత్రాలు సరిచూసుకునేందుకు, చెల్లింపులకు రెండేసి వారాల సమయం కావాలన్నారు. ఒక్క రూపాయీ డిపాజిట్‌ చేయని అసదుద్దీన్‌ ఒవైసీ తమపై పిటిషన్‌దారుగా ఉన్నారని, రికార్డుల పరిశీలనకు సమయం కావాలని రంజిత్‌కుమార్‌ తెలిపారు. అసదుద్దీన్‌ రాష్ట్రంతో ఆడుకుంటున్నారని న్యాయవాది ఆరోపించారు. డిపాజిటర్ల రికార్డులు, ఇతర వివరాల అందజేతలో తెలంగాణ అధికారులు, పోలీసుల అలసత్వం కనిపిస్తోందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ వ్యాఖ్యానించారు. చిన్న డిపాజిటర్లకు చెల్లింపులు జరగాలనే ఉద్దేశంతో హీరాగోల్డ్‌ కార్యాలయం తెరిచేందుకు, ఖాతాల పునరుద్ధరణకు అనుమతిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన