
ప్రధానాంశాలు
కుటుంబంలో ‘పరిహారం’ చిచ్చు!
అక్క, అన్నను హత్యచేసిన తమ్ముడు
శ్రీకాకుళం జిల్లా రామచంద్రాపురంలో దారుణం
రణస్థలం, న్యూస్టుడే: సొంత తమ్ముడే అక్కను, అన్నను కిరాతకంగా కత్తితో నరికి చంపిన ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో నిర్మించనున్న అణువిద్యుత్తు కేంద్రానికి సేకరించిన భూములకు సంబంధించి వచ్చిన పరిహారాన్ని పంచుకునే విషయంలో మనస్పర్థల కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన గొర్లె సన్యాసిరావు, గొర్లె రామకృష్ణ అన్నదమ్ములు. వీరి సోదరి జయమ్మ. అణువిద్యుత్తు కేంద్రం వల్ల వచ్చిన పరిహారం పొందే విషయంలో వీరి మధ్య చాలా రోజులుగా వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం సన్యాసిరావు(54), జయమ్మ(50)లతో రామకృష్ణ గొడవపడ్డాడు. మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీయడంతో వెంట తెచ్చుకున్న కత్తితో రామకృష్ణ విచక్షణా రహితంగా వారిపై దాడి చేశాడు. దీంతో జయమ్మ అక్కడికక్కడే చనిపోగా సన్యాసిరావును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని
సినిమా
- Curfew: తెలంగాణలో నేటి నుంచి రాత్రి వేళ!
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- Corona Vaccine : 44 లక్షల డోసులు వృథా
- కార్చిచ్చులా కరోనా
- India Corona: కాస్త తగ్గిన కొత్త కేసులు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
- భారత్లో వ్యాక్సిన్లకు అమెరికా అడ్డుపుల్ల..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
