close

ప్రధానాంశాలు

Published : 08/03/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దుంపలకని అడవికి వెళ్లి..మంటల్లో చిక్కిన చెంచులు

మన్ననూర్‌, న్యూస్‌టుడే: నల్లమల పులుల అభయారణ్య ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన చెంచులు మంటల్లో చిక్కుకోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధి మల్లాపూర్‌కు చెందిన 11 మంది చెంచులు ఆదివారం ఉదయం దేవరపెంట అటవీ ప్రాంతంలో నన్నారి గడ్డలను తవ్వేందుకు వెళ్లారు. దుంపలను వెతుకుతూ లోపలకు వెళ్తుండగా అడవిలో గడ్డికి నిప్పంటుకొని ఒక్కసారిగా మంటలు లేచాయి. అయిదుగురు చెంచులు చెట్లెక్కి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. ఈ క్రమంలో మల్లాపూర్‌ పెంటకు చెందిన నిమ్మల లింగయ్య, మామిళ్ల లింగయ్య, చిగుర్ల మల్లయ్య, నిమ్మల చిన్న బాలయ్య, కాట్రాజు ఎల్లయ్యలతో పాటు మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. నిమ్మల లింగయ్య, మామిళ్ల లింగయ్యలకు శరీరం మొత్తం కాలటంతో వారి పరిస్థితి విషమంగా మారింది. మంటల నుంచి తప్పించుకున్న చెంచులు అందించిన సమాచారంతో రెండు వాహనాల్లో 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను అచ్చంపేట సివిల్‌ ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అటవీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన