
ప్రధానాంశాలు
మహిళా దినోత్సవం సాక్షిగా ‘ఆమె’పై పెట్రో దాడి!
బాకీ సొమ్ము అడిగితే నిప్పంటించిన ‘పశు’వ్యాపారి
ఈనాడు, మెదక్, అల్లాదుర్గం, న్యూస్‌టుడే: ఒకవైపు ప్రపంచమంతా ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకొంటున్న వేళ ఓ మహిళపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. 80 శాతం కాలిన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాకీ డబ్బులు అడిగిన పాపానికి ఓ పశువుల వ్యాపారి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. గ్రామంలోకి చేరుకుందామని ప్రయత్నించినా కాలిన గాయాలతో నడవలేక గాంధీ, అంబేడ్కర్ విగ్రహాల సాక్షిగా వాటి సమీపంలోనే ఆమె కుప్పకూలిపోయారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం మల్కాపూర్ తండాకు చెందిన సక్రిబాయి(42) భర్త గతంలో బంధువులతో జరిగిన గొడవల్లో హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరికి పెళ్లయింది. ఆదివారం జోగిపేట సంతకని ఇంట్లోంచి వెళ్లిన ఆమె రాత్రయినా తిరిగిరాలేదు. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామ శివారులో కాలిన గాయాలతో పడి ఉన్నట్టు సోమవారం ఉదయం తెలిసి.. కుటుంబ సభ్యులు అక్కడకు పరిగెత్తారు. అప్పటికే ఒళ్లంతా తీవ్రంగా కలిపోయి ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. సంత నుంచి వచ్చేటపుడు గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన పశువుల వ్యాపారి సాదత్ పెట్రోలు పోసి నిప్పంటించాడని చెబుతూనే ఆమె అపస్మారక స్థితికి చేరుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. సక్రిబాయికి సాదత్ డబ్బులు ఇవ్వాల్సి ఉందని.. అవి అడగానికి వెళ్తే ఇలా దాడి చేశాడని.. ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు. దుండగుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బంజారా సేవాలాల్ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు రమేశ్‌నాయక్ ఎస్సై మోహన్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
మరిన్ని
సినిమా
- అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- కేటీఆర్ సర్ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా?
- తారక్ అభిమానులకు శుభవార్త!
- ‘ఉప్పెన’ జోడీగా సుధీర్-రష్మి సందడి
- ప్రగ్యా నవ్వులు.. మెరిసిన ప్రియాంక..
- తొలిపోరులో హైదరాబాద్ ఓటమి
- రోడ్డుప్రమాదం:కుమార్తె సహా దంపతుల మృతి
- పేడ దిబ్బలో మహిళ అస్తిపంజరం
- ఉప్పెన.. కృతి ఇంత కష్టపడిందా!
- పవన్ నటించలేదు: నాగబాబు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
