‘తల’పండిన స్మగ్లింగ్‌

ప్రధానాంశాలు

Updated : 22/03/2021 05:58 IST

‘తల’పండిన స్మగ్లింగ్‌

విగ్గులో దాచి బంగారం రవాణా  
చెన్నైలో 11 మంది అరెస్టు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: దుబాయి, షార్జా నుంచి ప్రత్యేక విమానాల్లో చెన్నైకి అక్రమంగా తీసుకొచ్చిన రూ.2.53 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు... చెన్నై విమానాశ్రయానికి దుబాయి,   షార్జా నగరాల నుంచి ఆదివారం రెండు ప్రత్యేక  విమానాలు వచ్చాయి. అందులో ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. చెన్నై, తిరుచ్చి, రామనాథపురం, విళుపురం, సేలం జిల్లాలకు చెందిన ఏడుగురు వ్యక్తులపై అనుమానంతో ప్రత్యేకంగా సోదా చేయగా ముడి బంగారంతోపాటు తల విగ్గు, సాక్సుల్లో దాచిన బంగారం పేస్టును గుర్తించారు. మొత్తం రూ.2.53 కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్టు చేశారు. ఆ సమయంలో చెన్నై నుంచి షార్జాకు అక్రమంగా తీసుకెళ్లేందుకు తెచ్చిన రూ.24 లక్షల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన