వాళ్లు అన్నలు కాదు.. కామాంధులు
close

ప్రధానాంశాలు

Updated : 07/04/2021 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లు అన్నలు కాదు.. కామాంధులు

చిన్నతనం నుంచి అత్యాచారం చేస్తున్నారంటూ ఓ యువతి ఆవేదన

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: ‘‘వాళ్లు అన్నయ్యలు కాదు కామాంధులు. చిన్నతనం నుంచి నుంచి నన్ను శారీరకంగా లోబరచుకుని విషయం బయటకు చెబితే చంపేస్తానంటున్నారు. కన్నతల్లికి చెబితే అసభ్యకరంగా మాట్లాడుతోంది. పెద్ద దిక్కుగా ఉన్న పెద్దమ్మ, పెదనాన్నలకు చెబితే ఇదంతా కామన్‌ అంటూ నీచంగా మాట్లాడుతున్నారు. మెడిసిన్‌ చదవాలనుకునే నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు సార్‌..! వాళ్లను శిక్షించి నాకు న్యాయం చేయండి సార్‌..!’’ అంటూ ఓ 20 ఏళ్ల యువతి కొత్తగూడెం రెండో పట్టణ పోలీసులను మంగళవారం ఆశ్రయించింది. ఇన్‌స్పెక్టర్‌ బత్తుల సత్యనారాయణ కథనం ప్రకారం.. బాధిత యువతి చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. కుటుంబ బాధ్యతలన్నీ తల్లి చూసేది. ఆమె చిన్నతనంలో వీరి కుటుంబం మణుగూరులో ఉండేది. ఆమె 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచే (2009) సొంత అన్నయ్య ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. కొన్నేళ్ల క్రితం అతడికి ఉద్యోగం రావటంతో కొత్తగూడేనికి వచ్చారు. ఆమె పెద్దదైనా అతడు అలాగే వ్యవహరిస్తున్నాడు. అతడి హింసలు భరించలేక ఇంటర్‌ చదివే సమయంలో కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళితే అక్కడ వరసకు అన్నయ్య అయిన వాళ్ల కుమారుడు ఆమెపై లెంగికదాడికి దిగాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. తల్లి, పెద్దమ్మ, పెదనాన్నలకు చెప్పినా పట్టించుకోకపోగా నీచంగా మాట్లాడేవాళ్లు. మెడిసిన్‌ ఎంట్రన్స్‌ శిక్షణ నిమిత్తం ఇటీవల వేరే ప్రాంతానికి వెళ్లినా లాక్‌డౌన్‌ సమయంలో మళ్లీ ఇంటికి చేరక తప్పలేదు. అప్పుడూ అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో కొన్ని రోజుల వరకు వారికి దూరంగా ఉన్నా మళ్లీ సెలవులు ఇవ్వడంతో తిరిగి కొత్తగూడేనికి వచ్చిన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు అన్నయ్యలతోపాటు తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన