
ప్రధానాంశాలు
మతిస్థిమితంలేని మహిళ విగ్రహాలు ధ్వంసం చేసింది
చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడి
కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గోనుగూరు పేటగుట్టపై నెలకొన్న శ్రీవళ్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని దేవతా విగ్రహాల ధ్వంసం కేసును 24 గంటల్లోపు ఛేదించినట్లు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. కుప్పం గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లిన పూజారికి విగ్రహాలు కనిపించలేదు. పరిసరాలను పరిశీలించగా సమీపంలోని గుట్టలో విగ్రహాలు ధ్వంసమై పడి ఉండటాన్ని గమనించారు. పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. గ్రామంలోని ఓ మతిస్థిమితం లేని మహిళ మద్యం తాగి ఆలయంలో నిద్రిస్తుండేది. ఆమే ఈ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు తేలింది. ధ్వంసం చేసినట్లు ఆమె కూడా అంగీకరించింది’ అని వివరించారు. కేసు విచారణ చేయకముందే ఇందులో కుట్రకోణం ఉందని ప్రతిపక్షాలు అనడం, సీబీఐతో కేసు విచారించాలని డిమాండ్ చేయడాన్ని ఖండించారు.
11 మంది తెదేపా నాయకులపై కేసు
కుప్పం మండలంలోని 11 మంది తెదేపా నాయకులపై కేసు నమోదైంది. తెదేపా అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఏ-1 ముద్దాయిగా మరో 10 మంది నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాల ధ్వంసం విషయంలో విచారణ నిమిత్తం కొందరిపై, విచారిస్తున్న పోలీసులకు అడ్డుపడి విధులకు ఆటంకం కలిగించారని మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. బుధవారం ముగ్గురు నాయకులను అదుపులోకి తీసుకొని గుడుపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అక్రమ కేసులు ఎత్తేయాలి: చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న నిందితుల్ని వదిలేసి.. న్యాయం చేయాలని కోరుతున్న తమ పార్టీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపా నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని బుధవారం డీజీపీకి లేఖ రాశారు. ‘‘అధికార పార్టీతో కుమ్మక్కై ఓ వర్గం పోలీసులు రాజకీయ కక్షసాధింపుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి అధికారులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని
సినిమా
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- కార్చిచ్చులా కరోనా
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- చెన్నై చెడుగుడు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
- వచ్చే 3 వారాలు కీలకం
- భారత్‌లో కరోనా: యూకే ఆంక్షలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
