close

ప్రధానాంశాలు

Published : 08/04/2021 04:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విమానం మరుగుదొడ్డిలో 1.2 కిలోల బంగారం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ఓ ప్రయాణికుడు దుబాయ్‌ నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో భద్రతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ బంగారం స్మగ్లర్‌ దుబాయ్‌ నుంచి కొచ్చిన్‌ అనుసంధాన విమానంలో శంషాబాద్‌కు బయలుదేరాడు. 1.2 కిలోల బరువు గల బంగారం బిస్కెట్లను ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లలో తీసుకొస్తున్నాడు. శంషాబాద్‌లో భద్రతాధికారులు తనిఖీ చేస్తుండటం గమనించి విమానం మరుగుదొడ్డిలో పడేశాడు. కస్టమ్స్‌ అధికారులు విమానంలో తనిఖీలు చేయగా మరుగుదొడ్డిలో రూ.60 లక్షల విలువైన 11 విదేశీ బంగారం బిస్కెట్లు దొరికాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన