close

ప్రధానాంశాలు

Updated : 08/04/2021 06:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుమానమే ఆయువు తీసింది!

పసికందును సంప్‌లో పడేసిన తండ్రి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: తనకు పుట్టలేదన్న అనుమానంతో ఎనిమిది మాసాల కుమారుడిని ఓ తండ్రి సంప్‌లో పడేసి చంపేశాడు. హృదయ విదారక సంఘటన శంషాబాద్‌ పరిధి తొండుపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పోలీసు కథనం ప్రకారం.. తొండుపల్లికి చెందిన గంధం విక్రమ్‌కుమార్‌కు, శంషాబాద్‌కు చెందిన యువతితో ఆరేళ్ల క్రితం పెళ్లయింది. అతడొక క్షౌరశాలలో పని చేస్తున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడుతుండేవాడు. మూడేళ్ల క్రితం గొడవ పెద్దలు, పోలీసు పంచాయితీ వరకు వెళ్లింది. ఎనిమిది మాసాల క్రితం వారికి ఓ బాబు జన్మించాడు. పెళ్లైన ఆరేళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడు తన సంతానం కాదేమో అని విక్రమ్‌ అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి భార్య పక్కలో నిద్రిస్తున్న పసికందును తీసుకువెళ్లి నీటి సంపులో పడేసి బయటకు వెళ్లిపోయాడు. అక్కడొక స్నేహితుడు కనిపించడంతో అతడితో ఈ విషయం చెప్పాడు. ఆ మిత్రుడు వెంటనే ఇంటికొచ్చి అప్రమత్తం చేయడంతో కుటుంబసభ్యులు సంపులో చూడగా అప్పటికే బాలుడు మృతిచెందాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన