కుటుంబాన్ని వెంటాడిన కరోనా
close

ప్రధానాంశాలు

Published : 10/04/2021 04:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటుంబాన్ని వెంటాడిన కరోనా

గతేడాది తండ్రి, కుమార్తె మరణించగా ప్రస్తుతం కుమారుని మృతి

దాచేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధి నారాయణపురానికి చెందిన ఇరికేపల్లి బీఈడీ కళాశాలల కరస్పాండెంట్‌ కోలా శ్రీనివాసరెడ్డి (50) కరోనాతో శుక్రవారం చనిపోయారు. ఆయన కొద్ది రోజుల నుంచి విజయవాడ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన తండ్రి విశ్రాంత వీఆర్వో సదాశివరెడ్డి గతేడాది కరోనాతో కన్నుమూశారు. సదాశివరెడ్డి కుమార్తె, నడికూడి మాజీ సర్పంచి మందపాటి విజయశ్రీ కూడా దాదాపు ఏడాది కిందట కరోనాతో చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కరోనా మింగేయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన