close

ప్రధానాంశాలు

Updated : 11/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంగ్రెస్‌ కార్యకర్త ఇంట్లో  దొరికిన డబ్బు, మద్యం

నిడమనూరు, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ కార్యకర్త మేరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో సాగర్‌ ఉప ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృంద సభ్యులు ఆక్మసిక తనిఖీలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చేసిన ఈ తనిఖీల్లో రూ.4,81,200తో పాటు వివిధ బ్రాండ్లకు సంబంధించిన 96 మద్యం సీసాలు లభించాయని బృంద ఇన్‌ఛార్జి మహ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌ నిడమనూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఓటర్లకు పంచడానికి అక్రమంగా మద్యం, డబ్బు నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్సై కొండల్‌రెడ్డి తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన