close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రంథాలయానికి నిప్పుపెట్టిన దుండగులు

మైసూరు, న్యూస్‌టుడే: యువత పుస్తకాలు చదువుకుని జ్ఞానాన్ని పెంచుకోవాలనే తపనతో ఓ వ్యక్తి సొంతంగా గ్రంథాలయాన్ని నిర్వహిస్తుండగా.. కొందరు దుండగులు దానికి నిప్పుపెట్టారు. దీంతో పుస్తకాలన్నీ కాలి బూడిదయ్యాయి. కర్ణాటకలోని మైసూరు నగరానికి చెందిన సయ్యద్‌ ఇసాక్‌ గత కొన్నేళ్లుగా ఓ గుడిసెలో గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు. కూలీ పనుల్లో సంపాదించిన దానిలో కొంత మొత్తం వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేసేవారు. శుక్రవారం రాత్రి కొందరు దుండగులు గ్రంథాలయానికి నిప్పుపెట్టారు. దీంతో దాదాపు 11 వేల పుస్తకాలు కాలి బూడిదయ్యాయి. ఇసాక్‌ గ్రంథాలయానికి దుండగులు నిప్పు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సురేశ్‌ కుమార్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తాను వచ్చి కలుస్తానని సమాచారం పంపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన