close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తండ్రీకుమార్తె అనుమానాస్పద మృతి

ఒంటరితనమే ఉసురుతీసిందా?

విజయవాడ (మధురానగర్‌), న్యూస్‌టుడే: తండ్రీకుమార్తెలు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంతమిది... గదిలో లభించిన లేఖల్ని బట్టి ఆత్మహత్యలకు పాల్పడ్డారని భావిస్తున్నా... సంఘటన జరిగిన తీరు అనుమానాలు కలిగిస్తోంది. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. శ్రీనగర్‌కాలనీ రెండోలైన్‌కు చెందిన జగాని రవి(40), భరణి భార్యాభర్తలు. వీరి ఒక్కగానొక్క కుమార్తె గీతా సహస్ర (10) ఐదో తరగతి చదువుతోంది. రవి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఉద్యోగం మానేసి, విజయవాడ వచ్చేశారు. భరణి కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. తరచూ డయాలసిస్‌ చేయాల్సి వస్తోంది. ఆమె గవర్నర్‌పేటలోని పుట్టింట్లో ఉంటూ ఆసుపత్రికి వెళ్లివస్తున్నారు. శ్రీనగర్‌కాలనీలో రవి, గీతాసహస్ర ఉంటున్నారు. రవికి తన బావమరిది మధుబాబు శనివారం ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన రవి ఇంటికి వచ్చారు. లోపల ఉరికి వేలాడుతున్న రవి, మంచంపై పడిఉన్న గీతాసహస్రలను గుర్తించారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఇద్దరూ చనిపోయి ఉండటంతో  పోలీసులకు, భరణికి సమాచారం అందించారు.

నాలుగు లేఖలు: తండ్రీకుమార్తెలు చనిపోయిన గదిలో గోడలకు అతికించిన నాలుగు లేఖల్ని పోలీసులు గుర్తించారు. ‘నిన్న అంతా వచ్చారు. ఎవరూ నాతో మాట్లాడలేదు. 8వ తేదీనే ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించాను. సారీ బుజ్జి తల్లి. నీవు మంచి జీవితం కోసం కలలు కన్నావు. కానీ ఇలాంటి ఒంటరితనం కాదు. నా అవయవాలను అవసరమైన వారికి దానం చేయండి. నా కిడ్నీలను భరణికి దానం చేయండి’.. ‘నా చావుకు ఒంటరితనమే కారణం’ అని ఆంగ్లంలో ఉన్న ఆ లేఖల సారాంశం. గోడపై ‘ఐ నీడ్‌ హెల్ప్‌.. మమ్మ’ అని స్ప్రేపెయింట్‌తో రాసి ఉంది.  
నోటికి ప్లాస్టర్లు.. కాళ్లూచేతులకు కట్లు..
సంఘటన స్థలాన్ని చూస్తే తండ్రీకుమార్తెలను ఎవరైనా హత్య చేశారా? అనే అనుమానం కలుగుతుంది. బాలిక నోటికి ప్లాస్టర్‌ అతికించి, రవి ముఖానికి నల్లని వస్త్రం చుట్టి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయి. ఉద్యోగం మానేయడం, భార్య అనారోగ్యం, పెంచిన నానమ్మ ఇటీవల మరణించటం... రవిని ఒంటరితనంలోకి నెట్టేసి ఉండొచ్చునని, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆయన ఇలా ఆత్మహత్యకు ఒడిగట్టి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఏసీపీ షేక్‌ షాను, సత్యనారాయణపురం సీఐ బాలమురళీ పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన