close

ప్రధానాంశాలు

Updated : 11/04/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒంటరితనం.. ఆపై అనారోగ్యం

ఉరేసుకొని వృద్ధ దంపతుల ఆత్మహత్య

దమ్మపేట, న్యూస్‌టుడే: ఆర్థికంగా ఏ లోటూ లేదు. కూర్చొని తిన్నా తరగని ఆస్తి. కేవలం వృద్ధాప్యం..ఆవహించిన ఒంటరితనం..ముంచుకొస్తున్న అనారోగ్య సమస్యలు వృద్ధ దంపతులను ఆత్మహత్యకు పురిగొల్పాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు..
పట్వారిగూడెం గ్రామానికి చెందిన దూబగుంట్ల భూషణం(75), ఆదిలక్ష్మి(70) దంపతులది వ్యాపార కుటుంబం.  వారికి నలుగురు సంతానం. పిల్లలందరికీ ఆస్తిని పంచి ఇచ్చిన దంపతులు, జీవనానికి ఇబ్బందిలేనంత నగదును, నాలుగెకరాల భూమిని తమ వద్దే ఉంచుకున్నారు. కొన్నాళ్ల క్రితమే పెద్ద కుమారుడు ప్రమాదంలో మరణించగా, వివాహితులైన మిగిలిన ముగ్గురు కుమారులు అదే గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయినా కొంతకాలంగా దంపతులు ఒంటరితనానికి లోనై చుటుపక్కల వారితో ముభావంగా ఉంటున్నారు. దానికితోడు వయోభారం, అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మరింత మనోవేదనకు గురయ్యారు. వారణాసి వెళ్లి తనువు చాలిస్తే పుణ్యం దక్కుతుందనే ఆలోచన చేశారు. కరోనా నిబంధనలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఒకే ఫ్యానుకు ఉరి వేసుకున్నారు. ఉదయం చుట్టుపక్కల వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ‘కొంతకాలంగా పిల్లలు కూడా తల్లిదండ్రులతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని, ఈ పరిణామాలు కూడా వారిని బాధించి ఉంటాయనే అనుమానాలను’ స్థానికులు వ్యక్తంచేశారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన