close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 06:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బోయిన్‌పల్లి ఠాణాలో గుంటూరు శ్రీను

8నే న్యాయస్థానంలో లొంగుబాటు

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కేసులో ప్రధాన సూత్రధారి గుంటూరు శ్రీను.. న్యాయస్థానం ఆదేశాల మేరకు శనివారం బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న అతనికి.. ఇటీవల సికింద్రాబాద్‌ 6వ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి న్యాయస్థానం షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 11వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో ఇద్దరు వ్యక్తులు రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని, ప్రతి శనివారం నిందితుడు ఠాణాకు హాజరు కావాలని, పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్లాలని షరతులు విధించింది. ఈ మేరకు గుంటూరు శ్రీను ఈ నెల 8న ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో వెళ్లి న్యాయస్థానంలో లొంగిపోయాడని, ఇప్పుడు పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యాడని ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు. నిందితుడు న్యాయస్థానంలో లొంగిపోతున్నాడన్న విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ప్రధాన అనుచరుడైన శ్రీను..  ‘‘ప్రవీణ్‌రావును, ఆయన సోదరులను అపహరించేందుకు అనేక అంశాల్లో కీలకంగా వ్యవహరించాడు’’ అని పోలీసు వర్గాలు వివరించాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన