close

ప్రధానాంశాలు

Published : 11/04/2021 04:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

యూపీలో లోయలో పడ్డ ట్రక్కు

12 మంది మృతి

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఎటావా జిల్లాలో ఓ ట్రక్కు లోయలో పడటంతో 12 మంది మృత్యువాతపడగా.. 45 మందికి పైగా గాయపడ్డారు. బర్హపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉడి-చక్కర్‌నగర్‌ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగినట్లు ఏఎస్పీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. భక్తులతో ఆగ్రా నుంచి ఎటావా జిల్లాలోని కాళికాదేవి ఆలయానికి ట్రక్కు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురైందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ రూ. 2 లక్షల పరిహారం  ప్రకటించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన