close

ప్రధానాంశాలు

Published : 12/04/2021 03:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎదురు కాల్పుల్లో మావోయిస్టు నేత మృతి

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎదురుకాల్పుల ఘటన జరిగింది. దంతెవాడ జిల్లాలోని గాదం, జంగంపాల్‌ అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఆదివారం జరిగిన కాల్పుల్లో కట్టే కల్యాణ్‌ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టు నేత వెట్టి ఉంగా(32) మృతి చెందాడు. ఇతర మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారని, ఘటనా స్థలంలో ఉంగా మృతదేహంతోపాటు 2 కిలోల ఐఈడీ బాంబులు, 8 ఎంఎం పిస్టల్‌, విప్లవ సాహిత్యం, కిట్‌ బ్యాగ్‌ తదితర సామగ్రి లభించాయని పోలీసులు తెలిపారు. ఎదురు కాల్పుల్లో మరికొందరు మావోయిస్టులు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు: బీజాపుర్‌ జిల్లా నైమేడ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మినాగచల్‌ నది సమీపంలో వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులకు వినియోగిస్తున్న 2 పొక్లెయిన్లు, 1 ట్రాక్టర్‌, మరో రెండు వాహనాలను మావోయిస్టులు ఆదివారం తగలబెట్టారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన