close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 05:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపశ్రుతి

తేనెటీగల దాడిలో ఒకరి మృతి

మామునూరు, న్యూస్‌టుడే: రెండు దశాబ్దాల క్రితం వారంతా కలిసి పదోతరగతి చదివారు.. మళ్లీ ఇప్పుడు కుటుంబాలతోపాటు సరదాగా అదే విద్యాలయంలో కలవాలనుకున్నారు. ప్రణాళికలు రచించారు. ఆదివారం ఆత్మీయ కార్యక్రమంలో నిమగ్నమైన వేళ అనూహ్యంగా తేనెటీగల దాడిలో సహచరుణ్ని కోల్పోయారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం మామునూరు టీఎస్‌ఎస్‌పీ నాల్గోబెటాలియన్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 2000-2001లో పదోతరగతి చదివిన 60మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. అనంతరం వంటలు చేసేందుకు కట్టెలపొయ్యి వెలిగించగా సమీపంలోని చెట్టు పైనుంచి తేనెటీగలు ఒక్కసారిగా లేచి వారిపై దాడిచేశాయి. ఈ క్రమంలో ఖిలావరంగల్‌ పడమరకోటకు చెందిన మైదం దయాకర్‌(35)కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన