close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 05:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పు తీరుస్తుందనుకుంటే.. ఆయువు తీసుకుపోయింది

పంట నష్టంతో రైతు ఆత్మహత్య

ఉరవకొండ, న్యూస్‌టుడే: ‘అప్పులు తీరాలని ఈ ఏడాది ఉల్లి సాగు చేశావు. అప్పులు తీరకపోగా ప్రాణాన్నే తీసుకుపోయింది. ముగ్గురు పిల్లలతో ఎలా బతకాలి’ అంటూ ఆత్మహత్య చేసుకున్న రైతు భార్య విలపించిన తీరు అందరి మనసులను కలచివేసింది. ఈ విషాద ఘటన ఆదివారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గడేహోతూరులో చోటుచేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కానుకుర్తి(38)కి ఆరు ఎకరాల పొలం ఉంది. మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నారు. వ్యవసాయం, ఆయన తండ్రి అనారోగ్యం కారణంగా రూ.10 లక్షల వరకు అప్పులు అయ్యాయి. వాటిని ఎలాగైనా తీర్చాలన్న ఉద్దేశంతో ధర బాగా ఉంటుందని ఈ ఏడాది 8 ఎకరాల్లో ఉల్లి వేశారు. దిగుబడి బాగా తగ్గి.. కేవలం 40 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. క్వింటా రూ.1500 ప్రకారం అమ్ముడవటంతో మరింత నష్టపోయారు. పాత అప్పులకు తోడు, పంట నష్టాన్ని మిగల్చడంతో వారం రోజులుగా కలత చెందుతున్న రైతు ఆదివారం ఇంట్లో ఉరి వేసుకున్నారు. కుటుంబసభ్యులు గమనించే లోపు మృతి చెందారు. భార్య వరలక్ష్మి, ముగ్గురు పిల్లలతో కలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన