close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 05:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆడని మగ్గం.. ఆగిన ప్రాణం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేత కార్మికుడి ఆత్మహత్య

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: మరమగ్గాలు నడవక, ఉపాధికి మరో దారి లేక ఓ నేత కార్మికుడు చేజేతులా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పిసుక పోశెట్టి(70) మరమగ్గాల కార్మికుడిగా పని చేస్తుండేవాడు. ఈయనకు ఇద్దరు సంతానం.. కుమారుడు వెంకటేశం, కుమార్తె లక్ష్మికి ఇప్పటికే పెళ్లిళ్లయ్యాయి. పోశెట్టి భార్య కనుకవ్వ డబ్బులు తీసుకొని కార్మికులకు భోజనం పెట్టేది. ఇటీవల కూలి పెంచాలంటూ ఆసాములు, కార్మికులు సమ్మె చేయడంతో మరమగ్గాలు నడవలేదు. 20 రోజులుగా సాగిన సమ్మె వల్ల పనిలేక పోశెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 3 రోజుల ముందు సమ్మె ముగిసినా ఇళ్లకు వెళ్లిన కార్మికులు ఇంకా తిరిగి రాకపోయేసరికి డబ్బులు తీసుకొని భోజనం పెట్టే పరిస్థితీ లేకపోయింది. ఈ నేపథ్యంలో బతుకుతెరువు నిమిత్తం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ తమ తండ్రి ఇంట్లోనే గడిపేవాడని పోశెట్టి కుమారుడు వెంకటేశం పేర్కొన్నాడు. ఈ నెల 10న బయటకు వెళ్లిన ఆయన రాత్రయినా తిరిగిరాకపోయేసరికి ఊరంతా వెతికామని, ఆదివారం ఉదయం కొత్తచెరువులో మృతదేహం కనుగొన్నామని విలపించాడు. మరమగ్గాల బంద్‌ వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను భరించలేకనే తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని వెంకటేశం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకటేశం కూడా నేత కార్మికుడే. తల్లిదండ్రుల ఇంటికి సమీపంలోనే అద్దెకు ఉంటున్నాడు. సమ్మె కారణంగా ఈయనా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన