close

ప్రధానాంశాలు

Updated : 13/04/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివేకా హత్య కేసులో అనుమానితుల విచారణ

బ్యాంకు లావాదేవీలపై ఆరా

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, పులివెందుల: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. సోమవారం కడప జిల్లా పులివెందుల ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఇద్దరు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు. వివేకాకు అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డిని ఉదయం విచారణకు పిలిచారు. ఆయనతో పాటు వివేకా వ్యక్తిగత కార్యదర్శి హిదాయ్‌తుల్లా కూడా విచారణకు హాజరయ్యారు. ఇద్దరిని అతిథి గృహంలో విచారించారు. హిదాయ్‌తుల్లాను సాయంత్రం వరకు పలు అంశాలపై ప్రశ్నించారు. సీబీఐ అధికారులు పులివెందులలోని ఎర్రగంగిరెడ్డి ఇంటికి వెళ్లి పరిశీలించారు. వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలు చెరిపేశారనే అభియోగాలపై ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాష్‌ను రెండేళ్ల కిందట సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిలుపై ఉన్న ఎర్రగంగిరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సాయంత్రం హిదాయ్‌తుల్లా సమక్షంలో దాదాపు 3 గంటల పాటు వివేకా ఇంటి పరిసరాలను సీబీఐ బృందం పరిశీలించింది.  పులివెందులలోని ఓ బ్యాంకులో లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన