close

ప్రధానాంశాలు

Published : 16/04/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ బాధితురాలి ఆత్మహత్య

విశాఖపట్నం, న్యూస్‌టుడే: కరోనా బాధిత మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ కేజీహెచ్‌లో చోటుచేసుకుంది. విశాఖ ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన ప్రకారం.... కొత్తూరు అనకాపల్లికి చెందిన మహిళ(50), ఆమె భర్త(54), అత్త(68) ముగ్గురికీ కరోనా సోకడంతో ఈనెల 5న కేజీహెచ్‌లో చేరారు. ప్రత్యేక వార్డులో చికిత్స పొందారు. భర్త, అత్త కోలుకోవడంతో గురువారం డిశ్ఛార్జి చేస్తామని, మహిళకు ఇంకా కొన్ని రోజులు చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. తనకు ఇక కరోనా తగ్గదనే భయంతో ఆసుపత్రి మొదటి అంతస్తు కిటికీలో నుంచి దూకి, ఆత్మహత్యకు పాల్పడింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన