close

ప్రధానాంశాలు

Published : 16/04/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా భయంతో వృద్ధ దంపతుల బలవన్మరణం?

రాయవరం, న్యూస్‌టుడే: తమ పిల్లలకు భారం కాకూడదనే భావనతో కరోనా సోకిన వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన ప్రకారం... స్థానికులైన కర్రి వెంకటరెడ్డి(71), సావిత్రి(64)లకు ఈనెల 12న కొవిడ్‌ సోకింది. ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారిద్దరి కుమారుల్లో ఒకరు రాజమహేంద్రవరంలో, మరొకరు ఒడిశాలోని జైపూర్‌లో ఉంటున్నారు. ఉదయం ఇంట్లో దంపతుల అలికిడి లేకపోవడాన్ని గుర్తించిన సమీప బంధువులు రాజమహేంద్రవరంలోని కుమారుడికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న కుమారుడు పరిసర ప్రాంతాల్లో గాలించారు. సాయంత్రం వేళ వారిద్దరి మృతదేహాలను స్థానిక మండపేట కాలువలో గుర్తించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన