close

ప్రధానాంశాలు

Published : 16/04/2021 04:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన చిరుత

నిద్రపోతున్న వారిపై దాడి... ముగ్గురికి గాయాలు

వేలూర్‌, న్యూస్‌టుడే: ఇంట్లో పడుకుని నిద్రపోతున్న వారిపై అర్ధరాత్రి వేళ చిరుత దాడిచేసి గాయపరిచిన ఉదంతం తమిళనాడు వేలూర్‌ జిల్లాలో చోటు చేసుకొంది. గుడియాత్తం సమీపంలోని ఏర్తాంగల్‌ కలర్‌పాళ్యం గ్రామానికి చెందిన వేలాయుధం మేస్త్రీ. బుధవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. ఆయన భార్య ప్రేమ, కుమారుడు మనోహరన్‌, కుమార్తె మహాలక్ష్మి ఇంట్లో పడుకున్నారు. వేసవికాలం వల్ల ఉక్కపోతగా ఉండటంతో గాలి కోసం తలుపులు తీసే ఉంచారు. అర్ధరాత్రి వేళ ఓ చిరుత అక్కడికి వచ్చింది. ఇంటి పక్కన ఉన్న మేకల దొడ్డిలోకి చొరబడేందుకు యత్నించింది. వీధి కుక్కలు చుట్టుముట్టడంతో చిరుత వేలాయుధం ఇంట్లోకి దూరింది. లోపల పడుకున్న వారిపై దాడి చేసింది. ముగ్గురికీ గాయాలయ్యాయి. ఎలాగోలా తప్పించుకొని బయటకు వచ్చేశారు. చిరుత ఓ గదిలోకి వెళ్లడంతో బయట నుంచి తలుపు మూసేశారు. వేలూర్‌ అటవీశాఖ అధికారి మురళీధరన్‌, రేంజర్లు శంకరయ్య, శరవణబాబు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని గుడియాత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 10 గంటలపాటు ప్రయత్నించి.. చిరుతకు మత్తు ఇచ్చి బోనులో బంధించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన