close

ప్రధానాంశాలు

Updated : 20/04/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బస్సు టైరు పేలి ప్రమాదం

23 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం 

చిన్నబోధనం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ముందు టైరు పేలి డివైడర్‌పై ఒరిగిపోవడంతో పలువురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నబోధనం మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం 48మంది ప్రయాణికులతో కర్నూలుకు వెళ్తోంది. బస్సు ముందు టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపు తప్పి రహదారి పక్కనే డివైడర్‌పై ఒరిగింది. ప్రమాదంలో 23 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఇందులో బాలగుర్రమ్మ, తేజసంతోష్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డ్రైవరు సుబ్బయ్య అప్రమత్తమై డివైడర్‌ వైపు మళ్లించడంతో బస్సు ఒకవైపు ఒరిగి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన