close

ప్రధానాంశాలు

Published : 22/04/2021 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వివాహానికి తీసుకెళ్లలేదని?

సోన్‌, న్యూస్‌టుడే: మెదక్‌ జిల్లా పాపన్నపేట్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పావని(28)కి నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం లెఫ్ట్‌ పోచంపాడ్‌కు చెందిన సిద్దురాములుకు 2014లో వివాహమైంది. వీరికి ఆరేళ్లబాబు, మూడు సంవత్సరాల కూతురు ఉన్నారు. సంవత్సరం క్రితం అత్తతో పావనికి చిన్న గొడవ కావడంతో పుట్టింటికి వెళ్లింది. తర్వాత భర్త రాములు వెళ్లి ఇంటికి తీసుకొచ్చాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యుల వివాహ వేడుకకు తీసుకెళ్లలేదని భర్తపై అలిగిన పావని కొడుకును ఇంటి వద్దే ఉంచి కుమార్తెను తీసుకొని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భర్త ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో పావని, ఆమె కుమార్తె మృతదేహాలను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త, అత్త కలిసి పావనిని, పాపని చంపి ఎస్సారెస్పీలో పడేసి ఉంటారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన