close

ప్రధానాంశాలు

Published : 04/05/2021 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నా చావుకు కారణం.. బంధువులే

మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో గృహిణి

పొన్నూరు, న్యూస్‌టుడే:  ఆమె స్నానం చేస్తుండగా బంధువులే నగ్నంగా వీడియో తీసి డబ్బులు డిమాండ్‌ చేస్తూ వేధించడంతో ఆమె ఈ వ్యవహారాన్ని వీడియో తీసి ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా పొన్నూరు అర్బన్‌ పోలీసుల కథనం ప్రకారం... బలిమిడి శ్రీనివాసరావు, లక్ష్మీతిరుపతమ్మ(32) దంపతులు పొన్నూరు పట్టణం 17వ వార్డు నేతాజీనగర్‌లో నివాసం ఉంటున్నారు.  కొద్ది కాలం క్రితం విజయవాడలో ఉంటున్న తన సమీప బంధువైన నాగలక్ష్మి ఇంటికి లక్ష్మీతిరుపతమ్మ వెళ్లింది. అక్కడ స్నానం చేసేందుకు వెళ్లగా ఆ సమయంలో ఆమెను నగ్నంగా వీడియో తీశారు. ఆ వీడియోను బయట పెడతామని లక్ష్మీతిరుపతమ్మను నాగలక్ష్మి కుటుంబ సభ్యులు బెదిరించారు. వారి డిమాండు మేరకు లక్ష్మీతిరుపతమ్మ డబ్బులు చెల్లించింది. ఆ తరవాత మరింత పెద్ద మొత్తంలో ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఒత్తిడిని తట్టుకోలేక మనస్తాపానికి గురై ఈ నెల ఒకటో తేదీన పొన్నూరులోని తన నివాసంలో లక్ష్మీతిరుపతమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత ఆమె భర్త ఇంటికి వచ్చి స్ఫృహ కోల్పోయిన భార్యను పొన్నూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అనంతరం ఆమె ఫోన్‌లోని సెల్ఫీ వీడియోను పరిశీలించి అవాక్కయ్యాడు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ ఆయన ఈ నెల ఒకటో తేదీన అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆదివారం రాత్రి మృతిచెందింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన