close

ప్రధానాంశాలు

Published : 04/05/2021 04:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎరువుల కర్మాగారంలో ప్రమాదం

ముగ్గురు కార్మికులకు గాయాలు

ఫెర్టిలైజర్‌ సిటీ, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఒప్పంద కార్మికులకు గాయాలయ్యాయి. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నైట్రోజన్‌ కంప్రెషర్‌ ట్యాంకు నుంచి వచ్చే వాల్వును ఇంజినీరు ఆపేయకుండానే పైపులను శుభ్రం చేయాలని కార్మికులకు సూచించారు. వారు పైపులను శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తుండగానే నైట్రోజన్‌ ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీంతో సదానందం, ఎం.డి.నయీం, శ్రావణ్‌ గాయాలపాలయ్యారు. వారికి గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శనివారం కూడా ఇలాగే గ్యాస్‌ విడుదల కావడంతో కార్మికులు చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలిసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన