close

ప్రధానాంశాలు

Published : 04/05/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాలెంవాగు ప్రాజెక్టు వద్ద పేలిన మందుపాతర

వెంకటాపురం, న్యూస్‌టుడే: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం, రాచపల్లి గ్రామాల సమీపంలోని పాలెంవాగు మధ్య తరహా జలాశయం వద్ద మావోయిస్టులు మందుపాతరను అమర్చి పేల్చేశారు. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఆదివారం రాత్రి ఈ మందుపాతర పేలినట్లు సమాచారం. పేలుడు ధాటికి జలాశయం ఆనకట్టపై పెద్దగుంత ఏర్పడింది. ఆనకట్టకు స్వల్పంగా పగుళ్లు ఏర్పడ్డాయి. పేలుడుకు వినియోగించిన తీగలు, తునాతునకలైన అల్యూమినియం పాత్ర సంఘటన స్థలంలో కనిపించాయి. జలాశయంలో చేపల వేటకు వెళ్లిన గిరిజనులు గుంతను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ప్రాజెక్టు పనుల పూర్తి చేయడానికి వస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను లక్ష్యంగా పెట్టుకుని మావోయిస్టులు మందుపాతరను పేల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన