close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

ఒకరి సజీవ దహనం

తిరుమలలోని తితిదే ఆస్థాన మండపం సెల్లార్‌లోని దుకాణ సముదాయంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు తెలిపిన ప్రకారం... దుకాణ సముదాయంలో విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఉదయం 6.30 గంటలకు మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపకశాఖ, తితిదే భద్రతా విభాగ సిబ్బంది వచ్చి అతికష్టం మీద మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో పది దుకాణాలు పూర్తిగా, మరో పది పాక్షికంగా కాలిపోయాయి. మంటలను అదుపుచేసే క్రమంలో దుకాణాలను పరిశీలిస్తుండగా 84వ నంబరు షాపులో పని చేసే తిరుచానూరుకు చెందిన మల్లిరెడ్డి(45) మృతదేహం కనిపించింది. సోమవారం రాత్రి వరకు దుకాణంలో పని చేసి, అందులోనే నిద్రించగా.. మంటలు అంటుకున్న సమయంలో బయటకు రాలేక సజీవ దహనమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో దాదాపు రూ.40 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు సీఐ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

-న్యూస్‌టుడే, తిరుమలTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన