close

ప్రధానాంశాలు

Published : 05/05/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేసీఆర్‌ను దూషించిన వ్యక్తిపై కేసు

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: ఈటల రాజేందర్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషించిన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం న్యూబంజారాహిల్స్‌ తండాకు చెందిన ధరావత్‌ శ్రీనుపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. శ్రీను పదేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. ఈటల ఆస్తులపై విచారణకు కేసీఆర్‌ ఆదేశించడంతో ఆదివారం శ్రీను భాజపా గ్రూప్‌లో అసభ్య పదజాలంతో రూపొందించిన వీడియోను పోస్టు చేశాడు.  దీనిపై ధర్మపురం సర్పంచి నగేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యాపేట గ్రామీణ పోలీసులు ధరావత్‌ శ్రీనును మంగళవారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మండలానికే చెందిన ఓ పంచాయతీ కార్యదర్శి ఆ వీడియోను మరో గ్రూప్‌లో ఫార్వర్డ్‌ చేయగా సదరు వ్యక్తిని విధుల నుంచి తొలగించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన