ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో రెమ్‌డెసివిర్‌ దందా
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో రెమ్‌డెసివిర్‌ దందా

వరంగల్‌లోనూ బహిర్గతం

ఖమ్మం నేరవిభాగం, వరంగల్‌ క్రైం, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బుధవారం రెండు చోట్ల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల దందా బయటపడింది. ఖమ్మం, వరంగల్‌లలో స్టాఫ్‌ నర్సులే విక్రేతల అవతారం ఎత్తారు. ఖమ్మంలో అయితే ఏకంగా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి నుంచే ఇంజక్షన్లు బయటకు పోతున్నాయి. కొవిడ్‌-19 రోగులకు ఉపయోగించాల్సిన వాటిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకెళ్తుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు సమీపంలో మాటు వేసి స్టాఫ్‌ నర్సు బండారు సునిత, కాంట్రాక్టు ఉద్యోగులు పెసర గోపీకృష్ణ, కోలా సతీష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 6 ఇంజక్షన్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నల్లబజారులో ఒక్కో బాటిల్‌ను రూ.38 వేలకు విక్రయించడానికి వారు సిద్ధమయ్యారని పోలీసులు తెలిపారు. ఒక ద్విచక్రవాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను ఖమ్మం రెండో పట్టణ ఠాణాలో అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ రామానుజం తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కరుణాకర్‌ చెప్పారు. అలాగే హన్మకొండ బాలసముద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అధిక ధరకు విక్రయిస్తున్న మహిళను బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. ఆమె అక్కడి ఆసుపత్రిలో స్టాఫ్‌నర్సు. ఆమె వద్ద ఐదు ఇంజక్షన్లను, రూ.2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.29వేలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరో ప్రైవేటు డాక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన