డ్రైవర్‌, సహాయకుడి సజీవ దహనం
close

ప్రధానాంశాలు

Published : 06/05/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రైవర్‌, సహాయకుడి సజీవ దహనం

కంటెయినర్‌కు విద్యుదాఘాతంతో  ప్రమాదం
ఉప్పల్‌ ఐడీఏలో దారుణ ఘటన

ఉప్పల్‌, న్యూస్‌టుడే: కంటెయినర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.. ఏం జరిగిందో చూసే లోపే డ్రైవర్‌ సహా అతని సహాయకుడు సజీవ దహమైన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా పహరి మండలం లడంక గ్రామానికి చెందిన షాజాద్‌(36) కంటెయినర్‌ డ్రైవర్‌. గుజరాత్‌ నుంచి మారుతి కార్లను కంటెయినర్‌ వాహనంలో తీసుకొని మంగళవారం రాత్రి శంషాబాద్‌ చేరుకున్నారు. బిహార్‌లోని బక్సార్‌ జిల్లా ఖాజరియ గ్రామానికి చెందిన గంగాసాగర్‌(50) శంషాబాద్‌ సమీపంలోని తొండపల్లిలో ఉంటున్నాడు. షాజాద్‌ కార్ల లోడ్‌ను ఉప్పల్‌ ఐడీఏలో దించాల్సి ఉండడంతో.. నగరంపై అవగాహన లేని ఆయన గంగాసాగర్‌ను గైడ్‌గా పెట్టుకున్నాడు.  వారిద్దరూ ఉప్పల్‌ ఐడీఏలోని ఆర్‌కేఎస్‌ మోటార్స్‌ వద్దకు రాత్రి 2-3 గంటల సమయంలో చేరుకున్నారు. వాహనాన్ని అక్కడి రోడ్డు పక్కన నిలిపారు. ఈ క్రమంలో పైన ఉన్న విద్యుత్తు తీగలు వాహనానికి తాకి విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వెలువడడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు కిందకు దిగుతున్న సమయంలో వారిద్దరూ సజీవదహనం అయ్యారు.

రూ.500 కోసం వచ్చి..
స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకొన్న అగ్నిమాపక శకటం సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా షాజాద్‌, గంగాసాగర్‌ పూర్తిగా కాలిపోయి కనిపించారు. మరోవైపు వాహనంలోని ఆరు కార్లలో మూడు పూర్తిగా, మరో మూడు పాక్షికంగా కాలిపోయాయి. నగరంలో ఇతర రాష్ట్రాల వాహనాలకు దారి చెప్తే రూ.500 ఇస్తారు. గంగాసాగర్‌ కేవలం రూ.500 కూలికి వచ్చి సజీవ దహనమయ్యారు. అతడి బంధువు గోవింద్‌సాగర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన