మహారాష్ట్ర యువకుడి వీరంగం
close

ప్రధానాంశాలు

Published : 12/05/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్ర యువకుడి వీరంగం

మూడు రాష్ట్రాల్లో పలు చెక్‌పోస్టుల ఢీ

చింతూరు, న్యూస్‌టుడే: మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం వరకు వీరంగం సృష్టించారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా కారులో వేగంగా దూసుకువచ్చిన ఆ యువకుడు చెక్‌పోస్టును, ఆ తరువాత మోతుగూడెం మీదుగా వెళ్తూ అక్కడి బారికేడ్లను ఢీకొట్టి మారేడుమిల్లి వైపు వెళ్లాడు. అక్కడి నుంచి చింతూరు మీదుగా వెనక్కి వచ్చి కల్లేరు వద్ద ఏర్పాటుచేసిన ఒడిశా సరిహద్దుల్లోని చెక్‌పోస్టును కూడా ఢీకొట్టి ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లాడు. అటునుంచి డోర్నపాల్‌, ఎర్రబోరు, ఇంజరం, కుర్తీ చెక్‌పోస్టులను కూడా ఢీకొడుతూ వెళ్తుండగా.. పందిగూడ వద్ద సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కారును నిలిపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆపకపోవడంతో కాల్పులు జరిపారు. గాయపడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీ పరిధిలో జరిగిన ఘటనపై మోతుగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన