సుపారీ కోణంలో సాగిన విచారణ
close

ప్రధానాంశాలు

Published : 12/05/2021 04:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుపారీ కోణంలో సాగిన విచారణ

  సాంకేతిక ఆధారాలపైనే దృష్టి
  పుట్ట మధుపై కొనసాగుతున్న ప్రశ్నల పరంపర

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి-న్యూస్‌టుడే, గోదావరిఖని: హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసు విచారణ ముగింపు దశకు చేరుకుంది. హత్యలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, ఆయన భార్య, మంథని పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌  శైలజతో పాటు కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పూదరి సత్యనారాయణ ప్రమేయం ఉందని మృతుని తండ్రి కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదుపై నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నారు. 72 గంటల పాటు పోలీసుల అదుపులోనే ఉండి విచారణకు హాజరైన మధును సోమవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు ఇంటికి పంపించారు. మంగళవారం మరోసారి రామగుండం పోలీసు కమిషనరేట్‌కు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నలు అడిగిన పోలీసులు ఇంటికి తిరిగిపంపించారు. శైలజనూ విచారించారు. పోలీసులు సాంకేతిక ఆధారాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. కిషన్‌రావు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల వారీగా విచారణ చేపట్టారు. ఇప్పటికే కాల్‌డేటా సేకరించి ప్రధానంగా డబ్బుల వ్యవహారం.. సుపారీ కోణంలోనే లోతుగా పరిశీలిస్తున్నారు.
కుంట శ్రీను కుమారుడి నుంచి వివరాల సేకరణ
మధుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రులు, ఆర్థిక లావాదేవీలు ఉన్న సన్నిహితులకు సంబంధించిన 39 బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ప్రధాన నిందితుడు కుంట శ్రీను ఇంటి నిర్మాణానికి సంబంధించిన డబ్బులు ఎవరు ఇస్తున్నారన్న అంశంపైనా లోతుల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణ స్థితి... దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న విషయాలను అతడి కుమారుడు ఆకాశ్‌తో పాటు గుంజపడగ సర్పంచి కుంట రాజు ద్వారా వివరాలు సేకరించారు. బుధవారం విచారణకు హాజరు కావాలని మధుకు సూచించారు. విచారణ నివేదికను సిద్ధం చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన