లారీతో వెంటాడి.. ఆపై తొక్కించి
close

ప్రధానాంశాలు

Published : 13/05/2021 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లారీతో వెంటాడి.. ఆపై తొక్కించి

ఆమనగల్లు మండలంలో యువకుడి దారుణ హత్య

ఆమనగల్లు, న్యూస్‌టుడే: పాత కక్షలతో విధ్వంసం తగదని వారించబోయిన యువకుడిని లారీతో వెంటాడి.. వెంటాడి ఢీకొట్టిన దురాగతం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ గేటు సమీపంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ ఉపేందర్‌, ఎస్సై ధర్మేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిగడ్డ తండాకు చెందిన బాలకిషన్‌సింగ్‌, నిరంజన్‌సింగ్‌ కుటుంబాల మధ్య 20 ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. నిరంజన్‌సింగ్‌, రాజేష్‌సింగ్‌లు అన్నదమ్ములు. 2004లో జరిగిన ఘర్షణలో వీరి తల్లిదండ్రులు భారతీబాయి, బాలాజీసింగ్‌లు హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలకిషన్‌సింగ్‌ కుటుంబం వల్ల తమకు ప్రాణభయముందని ఇటీవలే నిరంజన్‌సింగ్‌, రాజేష్‌సింగ్‌ ఆమనగల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భయం నేపథ్యంలో సోదరులిద్దరూ తమ మిత్రులు, అనుచరులను రక్షణగా ఉంచుకుని రెండు కార్లలో మేడిగడ్డ గేటు సమీపంలో ఉన్న తమ వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని కూలీలతో వరికోత పనులు చేయిస్తున్నారు. బాలకిషన్‌సింగ్‌ మరో ఐదుగురితో కలిసి లారీలో అక్కడకు చేరుకుని రెండు కార్లను ఢీకొట్టి ధ్వంసం చేశారు. రాజేష్‌సింగ్‌ స్నేహితుడైన నందిగామకు చెందిన ఏకుల సందీప్‌ (26) అడ్డుకోబోతే నిందితులు లారీని అతడిపైకి పోనిచ్చారు. సందీప్‌ తప్పించుకునేందుకు మట్టి రోడ్డుపై పరుగులు తీశాడు. అయినా లారీతో వెంటాడి.. వెంటాడి ఢీకొట్టారు. కిందపడిపోయిన సందీప్‌ను లారీతో తొక్కించారు. ఛాతీభాగం బాగా ఒత్తిడికి గురవడంతో అతడు స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిందితులు అక్కడి నుంచి  పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన