డాక్టర్‌ అవతారమెత్తి కొవిడ్‌ రోగులకు చికిత్స
close

ప్రధానాంశాలు

Published : 14/05/2021 04:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డాక్టర్‌ అవతారమెత్తి కొవిడ్‌ రోగులకు చికిత్స

 ఒంగోలు నడిబొడ్డున నకిలీ బాగోతం

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలులో ఓ నకిలీ వైద్యుడు ఏడాది కాలంగా ఆసుపత్రి నిర్వహిస్తూ కొవిడ్‌ చికిత్సను సైతం చేస్తున్నాడు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గురువారం నిర్వహించిన తనిఖీల్లో ఈ బాగోతం వెలుగుచూసింది. ఒంగోలు సుందరయ్య భవన్‌ రోడ్డులోని ఆదిత్య జనరల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ వైద్యంతో పాటు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లకు భారీగా వసూలు చేస్తున్నారనే సమాచారం అందింది. దీంతో జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తనిఖీలకు ఆదేశించారు. ప్రాంతీయ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి కె.ఎస్‌.ఎస్‌.వి.సుబ్బారెడ్డి పర్యవేక్షణలో అధికార బృందం పరిశీలించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు కొవిడ్‌ బాధితులు ఇక్కడ వైద్యం పొందుతున్నట్లు గుర్తించారు. కొవిడ్‌ చికిత్సకు అనుమతులు లేవని, అసలు అక్కడ అర్హులైన వైద్యులే లేరని తేలింది. కనిగిరి మండలం చినఇర్లపాడు గ్రామానికి చెందిన ఆవుల శ్రీనివాసరెడ్డి దీన్ని నిర్వహిస్తూ అన్ని రకాల రోగాలకు చికిత్సనందిస్తున్నాడు. బీఫార్మసీ మొదటి సంవత్సరంలోనే అతడు ఆపేయడం గమనార్హం. తొలుత కొందరు నిపుణులైన వైద్యులు పనిచేసినా ఆ తర్వాత వారంతా బయటకు వెళ్లిపోయారు. అప్పటినుంచి శ్రీనివాసరెడ్డే చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. తాము గుర్తించిన అంశాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించనున్నట్లు విజిలెన్స్‌ డీఎస్పీ టి.అశోక్‌వర్థన్‌ తెలిపారు. ఇక్కడ వైద్యులు లేనందున ప్రస్తుతమున్న రోగులను నగరంలోని కొవిడ్‌ వైద్యశాలలకు పంపేందుకు సిఫారసు చేస్తున్నట్లు పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన