Corona: బతికిస్తారని వస్తే.. ‘ఆయుష్‌’ తీసేశారు
close

ప్రధానాంశాలు

Updated : 18/05/2021 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: బతికిస్తారని వస్తే.. ‘ఆయుష్‌’ తీసేశారు

దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం ●

11 రోజులకు సుమారు రూ.11 లక్షల బిల్లు

మలక్‌పేట, న్యూస్‌టుడే: కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ పర్వం ఆగడం లేదు. ఐసీయూలో రోగిని చేర్చి..  రూ.లక్షల్లో బిల్లు వసూలు చేస్తూ.. చివరికి మృతదేహాన్ని అప్పగిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటిదే సోమవారం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది. ఫీజులపై ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం కాకుండా కేవలం 11రోజులకు ఏకంగా రూ.11లక్షల పైచిలుకు బిల్లు వేశారని, అయినా తన సోదరుడు దక్కలేదని మృతుడి సోదరి కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఎర్ణం శ్రీధర్‌ (38) కొవిడ్‌ బారిన పడ్డారు. తీవ్రత పెరగడంతో నగరానికి తీసుకొచ్చి వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయుష్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఈనెల 5న చేర్పించారు. అప్పటి నుంచి రోజుకు రూ.85వేల ఫీజు చొప్పున ఈనెల 16 వరకు చెల్లించామని మృతుడి బంధువులు తెలిపారు. అంతేకాకుండా మందుల కోసం మరో రూ.20వేల చొప్పున నిత్యం చెల్లించామని, అయినా బతికించలేదని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రూ.10లక్షల పైచిలుకు బిల్లు కట్టినా.. ఇంకా రూ.3.5లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోందని ఆరోపించారు. రెండు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌లకు ఒక్కొక్కటి రూ.50వేల చొప్పున, ప్లాస్మాకు రూ.30వేలు ఆసుపత్రి వారు వసూలు చేశారని ఆరోపించారు. జూనియర్‌ వైద్యులతో చికిత్స నిర్వహిస్తున్నారని, ఇక ఐసీయూ కూడా అధ్వానంగా ఉందని వాపోయారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, గొడవ జరుగుతుందనే సమాచారంతో ఆసుపత్రి వద్దకు వచ్చామని మలక్‌పేట ఎస్సై వీరబాబు తెలిపారు. ఆసుపత్రి సీఈవో ప్రమోద్‌ను వివరణ కోరగా డబ్బుల కోసం తాము వేధించలేదని, కొవిడ్‌తో కోలుకుంటుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి శ్రీధర్‌ మృతి చెందారని తెలిపారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన