ఆ ఘోరాలు ‘మున్నా ముఠా’ పనే
close

ప్రధానాంశాలు

Published : 19/05/2021 04:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఘోరాలు ‘మున్నా ముఠా’ పనే

13 ఏళ్ల కిందటి హత్య కేసుల్లో దోషుల నిర్ధారణ
20న శిక్ష ఖరారు చేయనున్న న్యాయస్థానం

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై 2008లో జరిగిన దారుణ హత్య కేసుల్లో అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా, అతడి సహచరులను న్యాయస్థానం దోషులుగా పేర్కొంది. ఒంగోలులోని ఫ్యామిలీ, ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జి.మనోహర్‌రెడ్డి మంగళవారం తీర్పు వెలువరించారు. మొత్తం నాలుగు కేసుల్లో 17 మందిని దోషులుగా నిర్ధారించారు. వీరికి శిక్షను ఈ నెల 20న వెలువరించనున్నట్లు పేర్కొన్నారు.
నాడు ఏం జరిగింది?: సరిగ్గా పదమూడేళ్ల క్రితం జాతీయ రహదారిపై వెళ్లే పలు లారీలు అదృశ్యమయ్యాయి. నాగాలాండ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌తో పాటు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల నుంచి సరకుతో బయలుదేరిన లారీలు.. వాటి డ్రైవర్లు, క్లీనర్లూ కనిపించకుండాపోయారు.ఈ కేసులను పోలీసులు 2008లోనే ఛేదించారు. ఓ ముఠా చేతిలో 17 మంది హత్యకు గురైనట్లు గుర్తించారు.అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా తన ముఠాతో కలిసి లారీల్లో ఉన్న సిబ్బందిని మట్టుబెట్టి సరకును తస్కరించి, లారీలను తుక్కుగా మార్చి అమ్ముకున్నట్లు గుర్తించారు. మున్నాతో పాటు మరో 15 మంది సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి చేతిలో హత్యకు గురైన డ్రైవర్లు, క్లీనర్ల మృతదేహాలను ఒంగోలు తాలూకా, మద్దిపాడు, సింగరాయకొండ పోలీసు స్టేషన్ల పరిధిలో వెలికితీసి కేసులు నమోదు చేశారు. కొన్నింటిని నెల్లూరు సీఐడీ అధికారులు దర్యాప్తు చేసి న్యాయస్థానంలో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఎస్‌.శివరామకృష్ణప్రసాద్‌ వాదనలు వినిపించారు.
దోషులు వీరే..: అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా, షేక్‌ రియాజ్‌, సయ్యద్‌ హిదయతుల్లా, ఎండీ జమాలుద్దీన్‌, బత్తుల సాల్మన్‌, ఏపూరి చినవీరాస్వామి, పెద వీరాస్వామి, గుండు భానుప్రకాశ్‌, రాచమళ్ల సంపత్‌, గుండుబోయిన శ్రీధర్‌, షేక్‌ హఫీజ్‌, ఆర్ల గంగాధరరావు, షేక్‌ కమాల్‌ సాహెబ్, షేక్‌ రహంతుల్లా, షేక్‌ దాదాపీర్‌, షేక్‌ ఇర్ఫాన్‌, షేక్‌ రఫీలను దోషులుగా న్యాయస్థానం పేర్కొంది. నాలుగు కేసుల్లో ప్రధాన నిందితుడు మున్నాతో పాటు 17 మందిని దోషులుగా గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన