ఆస్తి కోసం ఘాతుకం..

ప్రధానాంశాలు

Published : 22/05/2021 04:46 IST

ఆస్తి కోసం ఘాతుకం..

ఉరి బిగించి ఉసురు తీసిన కొడుకు
  నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం

కందనూలు, న్యూస్‌టుడే: తోబుట్టువుకు ఆస్తి పంచి ఇవ్వటం సహించని అతగాడు, భార్యతో కలిసి కన్నతండ్రికి ఉరివేసి ప్రాణం తీశాడు.. మానవతకు మచ్చతెచ్చే ఈ పైశాచిక ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగింది.  సీఐ గాంధీనాయక్‌ కథనం ప్రకారం.. ఇదే మండలం నాగనూల్‌కు చెందిన జగ్గని మల్లయ్య(56)కు ఇద్దరు సంతానం.. కుమారుడు లోకేశ్‌, కుమార్తె పార్వతమ్మ.. ఇద్దరికీ వివాహాలు చేశారు. ఉన్న మూడెకరాల పొలంలో ఎకరా భూమిని కుమార్తెకు ఇవ్వాలని మల్లయ్య నిర్ణయించుకున్నారు. అది గిట్టని కొడుకు, తండ్రితో తరచూ తగాదాకు దిగుతున్నాడు. మల్లయ్య భార్య చెన్నమ్మకు మతిస్థిమితం లేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి మల్లయ్య, లోకేశ్‌ల మధ్య భూమికి సంబంధించి గొడవ జరిగింది. అనంతరం పథకం ప్రకారం.. లోకేశ్‌, అతని భార్య పద్మ కలిసి ఇంట్లో  నిద్రిస్తున్న మల్లయ్య గొంతుకు చున్నీతో ఉరివేసి హత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారన్నారు. మల్లయ్య సోదరి చిట్టెమ్మ పోలీసులకు ఫిర్యాదుచేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన