విత్తన విపత్తుపై ఉక్కుపాదం
close

ప్రధానాంశాలు

Updated : 13/06/2021 11:53 IST

విత్తన విపత్తుపై ఉక్కుపాదం

రూ. 4 కోట్ల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత
పలు జిల్లాల్లో బయటపడిన అక్రమాలు

నాగోలు, న్యూస్‌టుడే, ఈనాడు బృందం: నకిలీ విత్తనాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. పలు జిల్లాల్లో పోలీసులు, వ్యవసాయ, విజిలెన్స్‌ అధికారులు సోదాలు చేసి సుమారు రూ. 4 కోట్లకుపైగా విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో రూ. 2 కోట్లు, హైదరాబాద్‌లో రూ. 1.16 కోట్ల విలువైన విత్తనాలతోపాటు వరంగల్‌, సూర్యాపేట, మంచిర్యాల జిల్లాల్లోనూ అక్రమ సరకును పట్టుకున్నారు. రాచకొండ పోలీసులు, వ్యవసాయ అధికారులు సోదాలు చేసి, రూ.1.16 కోట్ల విలువైన నకిలీ విత్తనాలను గుర్తించారు. ముగ్గురు వ్యాపారులను అరెస్టు చేసి వారి లైసెన్సుల రద్దుకు సిఫారసు చేశారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గాలపురానికి చెందిన గారినేని ఫణిగోపాల్‌(40) మునగనూరులోని ఓ దుకాణంలో బీబో హైతీ, బీబో 9, బీబో చైత్ర పేరిట నకిలీ మిరప విత్తనాలను విక్రయిస్తున్నాడు. పసుమాముల గ్రామంలోని ఓ గోదాములో వీటిని నిల్వ ఉంచాడు. అధికారులు దాడి చేసి, రూ.60 లక్షల విలువైన నకిలీ బీబో బ్రాండ్‌ మిరప విత్తనాలు, 41 కిలోల ముడి విత్తనాలు, వేర్వేరు బ్రాండ్లతో ఉన్న కవర్లు స్వాధీనం చేసుకున్నారు.
గడువు తీరిన విత్తనాలు...
హయత్‌నగర్‌ కల్వంచ సమీపంలోని శాంతినగర్‌లో గోపాల్‌ కమల్‌ కిషోర్‌ సురేఖ ఆలియాస్‌ గోపాల్‌ అగర్వాల్‌(60) తన దుకాణంలో బ్రాండెడ్‌ విత్తనాలు అమ్ముతూ, అనుమతి లేని గోదాములో రియల్‌ ఇండియా ఆగ్రోటెక్‌ ఆముదపు విత్తనాలు, కంది, వరి విత్తనాలు, ధాన్యాలు నిల్వ ఉంచాడు. గడువు తీరిన విత్తనాలను కొత్త ప్యాకింగ్‌తో అమ్ముతున్నాడు. పోలీసులు రూ.50 లక్షల విలువైన వరి, కందులు, ఆముదం విత్తనాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.
* చింతల్‌కుంటలోని శ్రీకామాక్షి సీడ్స్‌ నిర్వాహకుడు కాకాని వెంకటరమణ బాబు(58) బీటీ-2 పత్తి విత్తనాలను అక్రమంగా నిల్వ ఉంచాడు. అనంతపురంలోని కదిరి నుంచి వేరుసెనగ విత్తనాలు కొని, అనుమతుల్లేకుండానే అమ్ముతున్నాడు. పోలీసుల దాడిలో రూ.6 లక్షల విలువైన పత్తి, వేరుసెనగ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాలో 44 మందిపై కేసులు
ఖమ్మం జిల్లాలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించి రూ.2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారని ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌.వారియర్‌ తెలిపారు. మొత్తం 14805 విత్తన ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని 44 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన శనివారం చెప్పారు.
విత్తనాలు, ఎరువుల జప్తు
విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం పలు జిల్లాల్లో సోదాలు నిర్వహించి రూ.58 లక్షల విలువైన నకిలీ విత్తనాలను, ఎరువులను జప్తు చేసింది. ఇందులో 229.55 క్వింటాళ్ల బీటీ పత్తి, సోయాబీన్‌ విత్తనాలు, 74.3 టన్నుల ఎరువులు, 268 కిలోల పురుగుమందులు ఉన్నాయి. వరంగల్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈ సోదాలు చేసినట్లు విజిలెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌రావు శనివారం తెలిపారు.
* మంచిర్యాల జిల్లాలో రూ.51 లక్షల విలువైన 21 క్వింటాళ్ల పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నట్లు రామగుండం కమిషనర్‌ సత్యనారాయణ తెలిపారు.
* సూర్యాపేట జిల్లాలో నకిలీ పత్తి విత్తన ముఠాల గుట్టు రట్టవుతోంది. అర్వపల్లి ప్రాంతంలో ఇటీవల పట్టుబడిన ముఠా ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేసి, రూ. 7 లక్షల విలువైన సుమారు 630 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన