తల్లీ కూతుళ్ల దారుణ హత్య
close

ప్రధానాంశాలు

Updated : 17/06/2021 06:07 IST

తల్లీ కూతుళ్ల దారుణ హత్య

భూ తగాదా నేపథ్యంలో గొడ్డలితో నరికిన సమీప బంధువు

హుస్నాబాద్‌, హుస్నాబాద్‌ గ్రామీణం న్యూస్‌టుడే: వ్యవసాయ బావి, నీటి పంపకం విషయంలో నెలకొన్న తగాదాలో తల్లి గుగ్గిళ్లపు స్వరూప (48), కూతురు ఉసికె నిర్మల(29) దారుణ హత్యకు గురయ్యారు. హుస్నాబాద్‌-మడద గ్రామాల మధ్య బుధవారం సాయంత్రం సమీప బంధువే వారిని గొడ్డలితో నరికి చంపడం సంచలనం కలిగించింది. హుస్నాబాద్‌ ఏఏస్పీ మహేందర్‌, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్‌ మండలం మడద గ్రామానికి చెందిన గుగ్గిళ్ల రాజయ్య, కనకయ్య అన్నదమ్ములు. వారికి తండ్రి నుంచి చెరో మూడెకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఆ భూమి, వ్యవసాయ బావి నీటి పంపకం విషయంలో కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. అయిదేళ్ల క్రితం కనకయ్య చనిపోయారు. ఇద్దరు కుమార్తెలకు ఆయన భార్య స్వరూప పెళ్లిళ్లు చేసి పెద్ద కుమార్తె నిర్మలతో కలిసి హుస్నాబాద్‌లో ఉంటున్నారు. రోజూ అక్కడ నుంచి కూతురితో కలిసి పొలం వద్దకు వెళ్తారు. బుధవారం తల్లీకూతుళ్లు పొలంలో ఉండగా రాజయ్య కుమారుడు శ్రీనివాస్‌ నీటి పంపకం విషయమై వారితో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆవేశానికి లోనైన అతను చేతిలోని గొడ్డలితో ఇద్దర్నీ నరికాడు. ఏఏస్పీ మహేందర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిర్మల భర్త ప్రవీణ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ ఘటనలో శ్రీనివాస్‌ ఒక్కడే పాల్గొన్నాడా.. అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘‘స్వరూపకు చెందిన భూమిని శ్రీనివాస్‌ దున్నడంతో మధ్యాహ్నం గొడవ జరిగింది. ఇదే విషయాన్ని నిర్మల తన భర్త ప్రవీణ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. తర్వాత జరిగిన గొడవతో శ్రీనివాస్‌ ఆవేశానికి గురై స్వరూప, నిర్మలను వెంబడించి నరికి చంపినట్లు ప్రాథమికంగా తెలిసింది’’ అని స్థానిక పోలీసుల సమాచారం. హత్యకు కారకుడిగా భావిస్తున్న శ్రీనివాస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో హత్య జరగ్గా సాయంత్రం 6.30 గంటల సమయంలో వెలుగులోకి వచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన